AP: పల్నాడు జిల్లా వినుకొండలో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కర్నూలు-గుంటూరు జాతీయ రహదారిపై ఎదురెదురుగా వచ్చిన ద్విచక్ర వాహనాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బండి నారాయణ (27) అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. పలువురు గాయపడ్డారు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.