AP: ఎన్టీఆర్ జిల్లా, వత్సవాయి మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఓ ఫ్యామిలీ బైకుపై వెళ్తుండగా ప్రమాదవశాత్తు లారీ కింద పడ్డారు. ఈ ఘటనలో ఏడు నెలల గర్భిణి మృతి చెందగా, ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మృతురాలిని రాజేశ్వరి (22) గా పోలీసులు గుర్తించారు. ఆమె వత్సవాయికి చెందిన సతీష్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. వీరికి రెండేళ్ల కుమారుడు కూడా ఉన్నాడు. భార్య మృతితో ఇరు కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.