గాజా నగరంపై ఇజ్రాయెల్ మరోసారి భీకర దాడులతో విరుచుకుపడింది. గాజాలో గురువారం రాత్రి నుంచి శుక్రవారం ఉదయం వరకు కొనసాగిన వైమానిక దాడుల్లో ఇప్పటివరకు మొత్తం 64మంది మరణించినట్లు స్థానిక మీడియా తెలిపింది. వందలాది మంది గాయపడినట్టు వెల్లడించింది. కాగా, క్షతగాత్రులను నగరంలోని నాజర్ ఆసుపత్రికి తరలించగా, మృతదేహాలను ఆసుపత్రి మార్చురీకి పంపినట్టు పేర్కొంది.