AP: సీఎం ముఖ్యమంత్రి చంద్రబాబుతో తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన సినీ ప్రముఖులు సమావేశం వాయిదా పడింది. తొలుత నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఈనెల 15న సాయంత్రం 4 గంటలకు ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో ఈ సమావేశం జరగాల్సి ఉంది. అయితే.. షూటింగ్‌ల కారణంగా పలువురు ఇతర ప్రాంతాల్లో ఉండటం, ముఖ్యమైన పెద్దలు అందుబాటులో లేకపోవడంతో సమావేశం వాయిదా పడినట్టు తెలుస్తోంది.