AP: సీఎం చంద్రబాబుతో ఈ నెల 15న సినీ ప్రముఖులు భేటీ కానున్నారు. ఉండవల్లిలోని నివాసంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో సా.4 గంటలకు ఈ సమావేశం జరగనుంది. ఇటీవల థియేటర్ల బంద్ అంటూ జరిగిన ప్రచారంపై ఏపీ మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఇండస్ట్రీకి ఏమైనా అవసరాలుంటే ఫిల్మ్ ఛాంబర్ ద్వారానే కలవాలని పవన్ ఆదేశించారు. ఈ క్రమంలో వీరి భేటీ ఆసక్తికరంగా మారింది.