TG: సినీ నిర్మాత కేపీ చౌదరి అంత్యక్రియలు ఖమ్మం జిల్లా బోనకల్ మండలం రాయన్నపేటలో మంగళవారం నిర్వహించనున్నారు. ఆర్థిక పరిస్థితులు తట్టుకోలేక గోవాలోని ఓ రిసార్ట్‌లో ఆయన సోమవారం ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. ఆయన మృతదేహాన్ని ఈరోజు సాయంత్రం స్వస్థలమైన రాయన్నపేటకి తీసుకురానున్నారు. స్వగ్రామంలోనే ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు బంధువులు తెలిపారు.