AP: బంగాళాఖాతంలో ఈ నెల 16న ఏర్పడిన అల్పపీడనం ఎట్టకేలకు బలహీనపడింది. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో శుక్రవారం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవనున్నాయి. శనివారం నుంచి పొడి వాతావరణం నెలకొంటుందని వాతావరణ శాఖ పేర్కొంది. రాష్ట్రంలో మళ్లీ చలి తీవ్రత పెరిగే అవకాశముందని నిపుణులు అంచనా వేస్తున్నారు.