ఫైనాన్స్ కంపెనీ వేధింపులు.. ఆటోడ్రైవర్ ఆత్మహత్య

74చూసినవారు
ఫైనాన్స్ కంపెనీ వేధింపులు.. ఆటోడ్రైవర్ ఆత్మహత్య
AP: ఫైనాన్స్ కంపెనీ వేధింపులతో ఓ ఆటో డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన కృష్ణా జిల్లా గుడివాడ మండలం మోటూరులో జరిగింది. విస్తార్ ఆటో ఫైనాన్స్ కంపెనీ నుంచి రావి సత్తిబాబు (35) అనే ఆటో డ్రైవర్ రూ.7.80 లక్షల రుణం తీసుకున్నారు. నగదు వాయిదా చెల్లించకపోవడంతో ఫైనాన్స్ కంపెనీ ప్రతినిధులు సత్తిబాబు ఇంటికి వెళ్లి గొడవకు దిగారు. తీవ్ర మనస్థాపానికి గురైన రావి సత్తిబాబు ఆత్మహత్యకు పాల్పడ్డారు.

సంబంధిత పోస్ట్