మహారాష్ట్రలోని సోలాపూర్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. అక్కల్‌కోట్ రోడ్డులోని సెంట్రల్ టెక్స్ టైల్ కంపెనీలో ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. మృతులు ఉస్మాన్ భాయ్, అనాస్ మన్సూర్, షిఫా మన్సూర్, యూసఫ్ మన్సూర్‌గా గుర్తించారు. పదుల సంఖ్యలో కార్మికులు తీవ్రంగా గాయపడినట్లు అధికారులు తెలిపారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు.