వైఎస్సార్ కడప జిల్లా బద్వేల్ గ్రామీణ పోలీస్ స్టేషన్‌లో అగ్ని ప్రమాదం జరిగింది. కంప్యూటర్లు, సామగ్రి మంటల్లో కాలిపోయాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటల్ని అదుపులోకి తీసుకొచ్చారు. అయితే కేసుల కీలక దస్త్రాలు బీరువాలో భద్రంగా ఉన్నాయని, షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు.