కారులో చెలరేగిన మంటలు.. భారీగా ట్రాఫిక్ జామ్ (వీడియో)

51చూసినవారు
TG: హైదరాబాద్‌లోని రాయదుర్గం మెట్రో స్టేషన్‌ సమీపంలో శుక్రవారం రాత్రి నడుస్తున్న కారు ఇంజిన్‌లో మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన కారు నడుపుతున్న వ్యక్తి వెంటనే పక్కకు ఆపి అందులో నుంచి బయటకు దిగాడు. అనంతరం అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించాడు. మాదాపూర్‌ ఫైర్‌ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలు ఆర్పివేశారు.
ఈ ప్రమాదంలో కారు ముందు భాగం సగం వరకు కాలిపోయింది. దీంతో ట్రాఫిక్ స్తంభించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్