జమ్మూకశ్మీర్‌లో మరోసారి కాల్పులు చోటుచేసుకున్నాయి. కుల్గాం జిల్లాలోని బెహిబాగ్ ప్రాంతంలో మాజీ సైనికుడు మంజూర్ అహ్మద్ వాగే నివాసంపై ముష్కరులు దాడికి తెగబడ్డారు. ఆయన ఇంటిపై కాల్పులు జరపడంతో ఆయనతో పాటు ఆయన భార్య, కుమార్తెలకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సమాచారంలో హుటాహుటీన రంగంలోకి దిగిన పోలీసులు.. వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. మాజీ సైనికుడు మంజూర్ అహ్మద్ చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు.