విద్యుత్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ రోడ్‌స్టర్ పేరిట మోటార్ సైకిల్‌ను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. ఇప్పటివరకు ఎలక్ట్రిక్ స్కూటర్లకు మాత్రమే పరిమితమైన ఈ కంపెనీ నుంచి వస్తున్న తొలి మోటార్ సైకిల్ ఇదే. ఇక ఇందులో రోడ్‌స్టర్, రోడ్‌స్టర్ ఎక్స్, రోడ్‌స్టర్ ప్రో మొత్తం 3వేరియంట్లలో ఉండగా, వీటిలో సబ్ వేరియంట్లు కూడా ఉన్నాయి. ఇక వీటి ధరలు రూ.74,999 నుంచి ప్రారంభమవుతుంది.