AP: NDA కూటమి ప్రభుత్వం ప్రజా పాలనలో ఏడాది పూర్తి చేసుకుందని సీఎం చంద్రబాబు అన్నారు. ‘అనేక సమస్యలు, సవాళ్లను దాటుకుని ఏడాది కాలంలోనే పేదల సేవలో పెన్షన్లు, అన్న క్యాంటిన్లు, దీపం-2, తల్లికి వందనం, మత్స్యకార సేవలో లాంటి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను అమల్లోకి తెచ్చాం. సుపరిపాలనలో తొలి అడుగు ప్రజల్లో నమ్మకాన్ని, భరోసాను కలిగించింది. మలి అడుగు మరింత సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను’ అని సీఎం ట్వీట్ చేశారు.