AP: అన్నదాత సుఖీభవ సాయాన్ని రైతులకు మూడు విడతల్లో అందజేస్తామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. పీఎం కిసాన్ కింద కేంద్రమిచ్చే రూ.2 వేలు, రాష్ట్రం వాటా రూ.5 వేలు కలిపి ఈ నెల 21న తొలివిడతలో రూ.7 వేలు జమ చేస్తామన్నారు. ‘కోకో, పామాయిల్ రైతులనూ ఆదుకుంటాం. వాణిజ్య పంటల్లో పురుగుమందుల వినియోగం తగ్గించి, నాణ్యమైన పంటనే పండించి ఎగుమతి చేయాలి' అని ఆయన పేర్కొన్నారు.