ప్రకాశం జిల్లాలో ఓ గుప్త నిధుల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఐదుగురు దుండగులు గుప్త నిధుల కోసం దర్శి పట్టణంలోని శివరాజ్‌నగర్ కొండపై 15 చోట్ల పెద్దఎత్తున తవ్వకాలు జరిపారు. ఈ క్రమంలో సమాచారం అందుకున్న పోలీసులు ఐదుగురు నిందితులను అరెస్ట్ చేశారు. ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.