ఛతీస్‌గడ్ రాష్ట్రంలోని దక్షిణ బస్తర్, దంతేవాడలోని ఐదుగురు మావోయిస్టులు పోలీసులఎదుట లొంగిపోయారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం లొంగిపోయిన వారికి రూ.25 వేల నగదుతో పాటు పునరావాసం కల్పిస్తుండటంతో మావోయిస్టులు భారీగా లొంగిపోతున్నారు. అయితే ఇలా లొంగిపోవడానికి ఇటీవల జరిగిన భారీ ఎన్‌కౌంటర్లు కూడా కారణం కావచ్చని పోలీసులు అభిప్రాయపడుతున్నారు.