అవిసె గింజల నూనెతో ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. అవిసె గింజల నూనెలో ఒలిక్ యాసిడ్, లినోలిక్ యాసిడ్, ఆల్ఫా-లినోలెనిక్ యాసిడ్ పుష్కలంగా ఉంటాయి. అవిసె గింజల నూనెతో రక్తంలోని చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. రక్తపోటు నియంత్రణకు, గుండె ఆరోగ్యానికి చాలా ఉపయోగపడుతుంది. మధుమేహం, కీళ్ల నొప్పులను అదుపులో ఉంచుతుంది. జీర్ణవ్యవస్థ పనితీరుని మెరుగుపరుస్తుంది. ఇంకా ఎముకలు బలంగా మారతాయి.