అమృత్‌సర్‌ చేరుకున్న అక్రమ వలసదారుల విమానం

65చూసినవారు
డొనాల్డ్‌ ట్రంప్‌ అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపారు. చట్టవ్యతిరేకంగా అగ్రరాజ్యంలో అడుగుపెట్టిన వారిని ప్రత్యేక విమానంలో స్వదేశానికి పంపారు. 205 మందితో టెక్సాస్‌ నుంచి బయల్దేరిన అమెరికా సైనిక విమానం బుధవారం పంజాబ్‌లోని అమృత్‌సర్‌ అంతర్జాతీయ ఎయిర్‌పోర్టులో దిగింది. వీరంతా పంజాబ్‌, దాని చుట్టుపక్కల రాష్ట్రాలకు చెందినవారిగా తెలుస్తోంది. అవసరమైన తనిఖీల అనంతరం వారిని ఇళ్లకు పంపనున్నట్లు తెలిసింది.

సంబంధిత పోస్ట్