సీఎం చంద్రబాబు ఆశలపై కృష్ణానది సహా బుడమేరు సృష్టించిన వరదలు గండి కొట్టాయి. ఈ వరదల కారణంగా.. సీఎం చంద్రబాబులో సంతోషం లేకుండాపోయింది. దీంతో ఆయన పెట్టుకున్న ఆశలు నెరవేరేలా కనిపించడం లేదు. వాస్తవానికి కూటమి సర్కారు ఏర్పడి.. ఈ నెల 20కి 100 రోజులు పూర్తి అవుతున్నాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబు అంగరంగ వైభవంగా కార్యక్ర మాలు చేపట్టాలని నిర్ణయించారు. దీనికి ప్రధాని నరేంద్ర మోడీని కూడా ఆహ్వానించాలని నిర్ణయించారు. కానీ వరదలు చంద్రబాబు ఆశలపై గండి కొట్టాయి.