మామిడితో పాటు ఇతర పంటలపై దృష్టి పెట్టాలి: అచ్చెన్నాయుడు

71చూసినవారు
మామిడితో పాటు ఇతర పంటలపై దృష్టి పెట్టాలి: అచ్చెన్నాయుడు
AP: చిత్తూరు జిల్లాలోని పాకాల(మం) దామలచెరువులోని మామిడి రైతులు, వ్యాపారులతో వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 5 లక్షల హెక్టార్లకు పైగా మామిడి సాగు అవుతుందని, ఇప్పటికి 22 వేల టన్నులు మార్కెటింగ్ జరిగిందని పేర్కొన్నారు. అలాగే రైతులు మామిడి సాగుతో పాటు ఇతర లాభసాటి పంటలపై రైతులు దృష్టి సారించాలని కోరారు. రైతులను ఇబ్బందులకు గురిచేసే గుజ్జు పరిశ్రమలపై చర్యలు తీసుకుంటామన్నారు.

సంబంధిత పోస్ట్