ఏపీలో త్వరలో జరగనున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు హాజరయ్యే అంశంపై మాజీ సీఎం జగన్ తాడేపల్లిలోని YCP కార్యాలయంలో ముఖ్య నేతలతో సమావేశం అయ్యారు. సమావేశంలో డిప్యూటీ మేయర్, మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల సందర్భంగా ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై చర్చించినట్లు సమాచారం. ఈమధ్యే లండన్ పర్యటనకు వెళ్లివచ్చిన జగన్.. ఇటీవల పార్టీకి విజయసాయిరెడ్డి రాజీనామా చేసిన అంశంపై చర్చించినట్లు తెలుస్తోంది.