రేపు పొదిలికి మాజీ సీఎం జగన్

62చూసినవారు
రేపు పొదిలికి మాజీ సీఎం జగన్
AP: ప్రకాశం జిల్లా పొదిలిలో వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ బుధవారం పర్యటించనున్నారు. పొగాకు రైతుల కష్టాలు తెలుసుకునేందుకు ఆయన వెళ్లనున్నారు. ఉ.10 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి పొదిలికి బయలుదేరుతారు. పొదిలికి చేరుకుని రైతులతో ముఖాముఖి నిర్వహిస్తారు. పొగాకు బోర్డు సందర్శన అనంతరం తిరిగి తాడేపల్లికి పయనమవుతారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్