ఏపీ రాజకీయాల్లో ఒక కీలక పరిణామం చోటుచేసుకుంటోంది. రాష్ట్ర మాజీ పీసీసీ చీఫ్, మాజీ మంత్రి శైలజానాథ్ వైసీపీ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధమయ్యారు. శుక్రవారం (నేడు) తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ సమక్షంలో ఆయన పార్టీలో చేరనున్నారు. వైసీపీలో కీలక నేతలుగా భావించిన ఎంపీలు, మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలు బయటకు వెళ్తున్న క్రమంలో.. శైలజానాథ్ చేరిక వైసీపీకి బలం చేకూరనుంది.