AP: మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ పీఏ మురళి అరెస్ట్ అయ్యారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అవినీతి నిరోధక శాఖ అధికారులు మురళిని అరెస్ట్ చేశారు. గురువారం అర్ధరాత్రి వరకూ మురళి ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. 20 ఎకరాలకు పైగా భూమి కొనుగోలు చేసినట్లు ఏసీబీ అధికారులు తమ సోదాల్లో గుర్తించారు. విశాఖ, శ్రీకాకుళం సహా పలు ప్రాంతాల్లో ప్లాట్లకు సంబంధించిన డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు.