AP: మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి ఇంకా పరారీలోనే ఉన్నారు. కాకాణి కోసం ఎస్పీ కృష్ణకాంత్ డీఎస్పీ శ్రీనివాసరావుని రంగంలోకి దించారు. బెంగళూరు, హైదరాబాద్‌తో పాటు పలు ప్రాంతాల్లో గాలిస్తున్నారు. అయితే నిన్న సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ నిరాకరించడంతో కాకాణి అరెస్ట్ అవుతారని అనుకున్నారు. కోర్టులోనే లొంగిపోతారని ప్రచారం జరిగింది. కానీ అలా జరగలేదు. గత రెండు నెలలుగా కాకాణి పోలీసుల నుంచి తప్పించుకుని తిరుగుతున్నారు.