AP: బుగ్గమఠం భూముల వ్యవహారంలో మాజీ మంత్రి, వైసీపీ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఏపీ హైకోర్టు ఇచ్చిన సింగిల్ జడ్జి ఉత్తర్వులపై స్టే ఇచ్చేందుకు ధర్మాసనం నిరాకరించింది. పెద్దిరెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను అత్యున్నత న్యాయస్థానం ముగించింది. హైకోర్టులో పెండింగ్‌లో ఉన్న పిటిషన్‌పై డివిజన్ బెంచ్ నిర్ణయం తీసుకుంటుందని వెల్లడించింది.