AP: మాజీ మంత్రి, వైసీపీ నేత రోజా మంచి మనసు చాటుకున్నారు. ఓ విద్యార్థికి ఆర్థిక సహాయం అందిస్తామని భరోసా ఇచ్చారు. విజయపురం మండలం ఆలపాకం గ్రామానికి చెందిన రంగనాధ రెడ్డి కుమార్తె జయ శ్రీ నీట్ ప్రవేశ పరీక్షలో (471 మార్కులు) మంచి మార్కులు సాధించారు. ఈ నేపథ్యంలోనే విద్యార్థినిని రోజా అభినందించారు. అనంతరం ఆమె మెడిసిన్ చదువుకు ఆవసరం అయ్యే ఖర్చులు మొత్తం తామే చెల్లిస్తామని రోజా హామీ ఇచ్చారు. దీంతో జయశ్రీ కుటుంబం రోజాకు ధన్యవాదాలు చెప్పింది.