AP: మాజీ పీసీసీ చీఫ్, మాజీ మంత్రి శైలజానాథ్ ఇవాళ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్న ఆయనకు అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. జగన్ నాయకత్వం నచ్చి పార్టీలో చేరానని, ఆయన మార్గదర్శకత్వంలో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నట్లు శైలజానాథ్ చెప్పారు. ప్రజల తరపున వైసీపీ పోరాడుతుందని స్పష్టం చేశారు.