AP: భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ ఇటీవల వైసీపీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. త్వరలో ఆయన జనసేనలో చేరబోతున్నట్లు సమాచారం. ఇప్పటికే ఆ పార్టీ కీలక నేతలతో టచ్‌లోకి వెళ్లినట్లు వార్తలు వస్తున్నాయి. జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురు చూస్తున్నట్లు తెలుస్తోంది. కాగా, 2019 ఎన్నికల్లో భీమవరం నుంచి పోటీ చేసిన పవన్‌ను గ్రంథి శ్రీనివాస్ ఓడించారు.