మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌కు 14 రోజుల రిమాండ్‌

68చూసినవారు
మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌కు 14 రోజుల రిమాండ్‌
AP: వైసీపీ నేత, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌కు కోర్టు 14 రోజుల రిమాండ్‌ విధించింది. పోలీసుల విధులకు ఆటంకం కలిగించారనే కేసులో మాధవ్‌తో పాటు మిగతా ఐదుగురికి కూడా న్యాయస్థానం 14 రోజుల రిమాండ్‌ విధిస్తూ శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. గుంటూరు జీజీహెచ్‌లో వైద్య పరీక్షల అనంతరం మాధవ్‌ను ప్రత్యేక మొబైల్‌ కోర్టు జడ్జి ఎదుట ప్రవేశపెట్టారు. వాదనలు విన్న జడ్జి.. ఏప్రిల్ 24 వరకు గోరంట్ల మాధవ్‌కు రిమాండ్‌ విధించారు

సంబంధిత పోస్ట్