బంగ్లాదేశ్లో మరోసారి హింసాత్మక ఘటనలు చెలరేగాయి. బంగబంధుగా పేరొందిన షేక్ ముజిబుర్ రెహమాన్ చారిత్రక నివాసానికి కొందరు నిరసనకారులు నిప్పంటించారు. అయితే భారత్లో ఆశ్రయం పొందుతున్నషేక్ హసీనా సోషల్ మీడియా వేదికగా ప్రసంగిస్తుండగా ఈ ఘటన జరగడం గమనార్హం. అయితే ఆమె ప్రసంగంలో మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని మధ్యంతర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేయాలని అవామీ లీగ్ పార్టీకి ఆమె పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలోనే ఢాకాలో ఈ ఘటనలు చెలరేగినట్లు తెలుస్తోంది.