AP: అన్నమయ్య జిల్లా మదనపల్లెలోని బెంగళూరు బస్టాండ్‌లో వైసీపీ మాజీ ఎమ్మెల్యే నవాజ్ బాషా అతడి అనుచరులతో కలిసి కండక్టర్‌పై దాడికి పాల్పడ్డాడు. పోలీసుల వివరాల ప్రకారం.. మదనపల్లె మండలం దొనబైలుకు చెందిన హరినాథ్ కొన్నేళ్లుగా ప్రైవేటు ట్రావెల్స్ బస్సు కండక్టర్‌గా పని చేస్తున్నారు. బెంగళూరు నుంచి వచ్చే మాజీ ఎమ్మెల్యే బస్సును కండక్టర్ హరినాథ్ ఓవర్ టేక్ చేసుకుని వస్తుండటంతో ఈ దాడికి పాల్పడినట్లు తెలిపారు.