AP: వైసీపీ మాజీ ఎమ్మెల్యే నవాజ్ బాషా రెచ్చిపోయారు. తన బస్సు కంటే ముందే వెళ్తారా అంటూ.. మరో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు కండక్టర్ హరినాథ్‌పై దాడికి పాల్పడ్డాడు. మదనపల్లి పట్టణంలో బెంగళూరు బస్టాండ్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. గాయపడిన హరినాథ్‌ను స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. అతడు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. సదరు కండక్టర్ కుటుంబసభ్యులు ఫిర్యాదు మేరకు బాషాపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది.