పోలీసులతో వైసీపీ మాజీ ఎమ్మెల్యే వాదన

52చూసినవారు
పోలీసులతో వైసీపీ మాజీ ఎమ్మెల్యే వాదన
AP: శ్రీసత్యసాయి జిల్లా రామగిరి మండలం పోలేపల్లిలో శ్రీలక్ష్మీనరసింహ స్వామి దర్శనానికి వైసీపీ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి వెళ్తుండగా.. పోలీసులు అడ్డుకున్నారు. మేము వెళ్తుంది దైవ దర్శనానికి కానీ, గొడవ పెట్టుకునేందుకు కాదని ప్రకాశ్ రెడ్డి పోలీసులతో వాదించారు. తమకు గన్‌మెన్లు ఉన్నారని, తమ వద్దా తుపాకులు ఉన్నాయన్నారు. పోలీసుల వద్దా తుపాకులు ఉన్నా.. శాంతి భద్రతలను ఎందుకు కాపాడలేరంటూ పోలీసులపై ఫైర్ అయ్యారు.

సంబంధిత పోస్ట్