ప్రపంచ జూనోసిస్ దినోత్సవం సందర్భంగా రేపు ఏపీ వ్యాప్తంగా కుక్కలకు ఉచిత యాంటీ రేబిస్ టీకాలు వేయనున్నట్లు పశుసంవర్ధక శాఖ వెల్లడించింది. పశువైద్యశాలలు, ఏరియా వెటర్నరీ ఆస్పత్రులు, పాలీ క్లినిక్స్, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల్లో ఈ టీకాలు అందిస్తారు. ఇందుకోసం 5.37 లక్షల టీకాలు సిద్ధం చేశారు. జంతువుల నుంచి మనుషులకు వ్యాధులు సంక్రమించే వాటిని జూనోటిక్ వ్యాధులు అంటారని అధికారులు వివరించారు.