ఆర్టీసీ పదో తరగతి లోపు చదివే విద్యార్థులకు ఉచిత బస్‌పాస్ సౌకర్యం అందిస్తోంది. కొత్త విద్యాసంవత్సరం ప్రారంభమవడంతో అధికారులు బస్‌పాస్‌ల జారీ, పునరుద్ధరణపై కసరత్తు చేస్తున్నారు. జూన్ 14 నుంచి బస్టాండ్లలో దరఖాస్తులు స్వీకరించనున్నారు. పాత పాస్‌లతో రీన్యువల్ చేసుకోవచ్చు. ఇంటర్, డిగ్రీ విద్యార్థులకు నెల, మూడునెలలు, ఏడాది పాస్‌లు చెల్లుబాటు అవుతాయి. apsrtcpass.in వెబ్‌సైట్‌లో కూడా దరఖాస్తు చేయవచ్చు.