ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం ప్రారంభంపై సందిగ్ధత నెలకొంది. త్వరలోనే ఉచిత బస్సు ప్రయాణం పథకం ప్రారంభిస్తామని మంత్రులు చెబుతున్నారు. తాజా సమాచారం ప్రకారం.. ఏపీ ఆర్థిక పరిస్థితి కారణంగా ఇంకా ఉచిత బస్సు పథకంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని సమాచారం. కేంద్ర బడ్జెట్ తర్వాత రాష్ట్రానికి వచ్చే నిధులను బట్టి ఈ పథకం అమలు చేయాలని కూటమి సర్కార్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది.