ఏపీలో ఉచిత క్యాన్సర్‌ పరీక్షలు: మంత్రి సత్యకుమార్‌

58చూసినవారు
ఏపీలో ఉచిత క్యాన్సర్‌ పరీక్షలు: మంత్రి సత్యకుమార్‌
క్యాన్సర్‌కి సంబంధించి ఉచిత పరీక్షలు చేస్తున్నామని ఏపీ వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ తెలిపారు. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా 1500 బృందాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. బ్రెస్ట్, సర్వైకల్, ఓరల్ క్యాన్సర్‌కు సంబంధించి ఈ పరీక్షలు నిర్వహిస్తామన్నారు. 155 మంది సూపర్ స్పెషలిస్టులు, 238 మంది స్పెషలిస్టులు, 4 వేల మంది ఏఎన్‌ఎంలు, 4 వేల మంది వైద్యాధికారులు, 18 వేల మంది పీహెచ్‌సీ సిబ్బందితో ఈ బృందాలను ఏర్పాటు చేశామన్నారు.

సంబంధిత పోస్ట్