అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవం సందర్భంగా ఆదివారం దేశంలోని అన్ని చారిత్రాత్మక ప్రదేశాలు, మ్యూజియాల్లో ఉచిత ప్రవేశం కల్పించారు. ఈ విషయాన్ని భారత పురావస్తు సర్వే సంస్థ ప్రకటించింది. ప్రజల్లో అవగాహన కల్పించడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్ల పేర్కొంది. దేశ వ్యాప్తంగా ఉన్న 52 మ్యూజియాలు, తమ పరిధిలో ఉన్న 3,698 చారిత్రక ప్రదేశాల్లో ఈ సౌకర్యం ఉంటుంది.