AP: గుండెపోటు వచ్చిన పేషంట్ ప్రాణం నిలిపేందుకు మొదటి గంటలోపే ‘టెనెక్టెప్లేస్-40’ అనే ఇంజెక్షన్ ఇవ్వాల్సి ఉంటుందని టీడీపీ పేర్కొంది. శుక్రవారం ఎక్స్ వేదికగా.. ‘రూ.40 వేల నుంచి రూ.45 వేల విలువైన ‘టెనెక్టెప్లేస్-40’ టీకాను రాష్ట్రప్రభుత్వం పేదలకు ఉచితంగా అందిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామీణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఈ ఇంజెక్షన్ అందుబాటులో ఉంది.’ అని తెలిపింది.