కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న దిష్టిబొమ్మకు రెడ్డి సంఘం నాయకులు శవయాత్ర నిర్వహించారు. ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలం కౌట(బి) గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన కులగణన సర్వేను తీన్మార్ మల్లన్న విమర్శించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రెడ్డి సంఘం నాయకులు మల్లన్న దిష్టిబొమ్మకు పాడే కట్టి, డప్పు కొడుతూ శవయాత్ర చేశారు.