AP: పల్నాడు జిల్లా సత్తెనపల్లికి చెందిన భవిష్య విద్యాసంస్థల డైరెక్టర్ శ్రీధర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శనివారం ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయిన శ్రీధర్.. విజయవాడ ప్రకాశం బ్యారేజీలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆర్థిక ఇబ్బందులే ఆత్మహత్యకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. ప్రకాశం బ్యారేజీలో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టగా.. మృతదేహం లభ్యమైంది. కుటుంబ సభ్యులకు పోలీసులు సమాచారం అందించారు.