శ్రీలంకతో నిన్న మ్యాచ్‌లో విజయానంతరం డ్రెస్సింగ్ రూమ్‌లో ప్లేయర్లతో భారత హెడ్ కోచ్ గంభీర్ మాట్లాడాడు. జట్టు ప్రదర్శనపై సంతృప్తి వ్యక్తం చేశాడు. అయితే శ్రీలంకతో వన్డే సిరీస్‌కు ఎంపిక కాని ఆటగాళ్లను గంభీర్ హెచ్చరించాడు. తిరిగి భారత జట్టులో చేరడానికి 3 నెలలు పడుతుందని, అప్పటివరకు ఫిట్‌నెస్, ఆటను మెరుగుపర్చుకోవడంపై దృష్టి సారించాలని సూచించాడు. కొన్ని రోజుల ముందు సన్నద్ధమైతే సరిపోతుందని నిర్లక్ష్యం వహిస్తే కుదరదని హెచ్చరించాడు.