TG:పెద్దపల్లి జిల్లా రంగంపల్లిలోని షాకింగ్ ఘటన జరిగింది. అక్కడి ఓ వ్యక్తి శ్రీ వెంకటేశ్వర వైన్స్‌లో తన స్నేహితులతో కలిసి బీరు తాగడానికి వెళ్ళాడు. బీరు కొని తాగే సమయంలో దానిలో చెత్తను చూసి సదరు కస్టమర్ షాక్ అయ్యారు. వైన్స్ షాప్ నిర్వాహకులను నిలదీయగా తమకు సంబంధం లేదని నిర్లక్ష్యంగా వ్యవహరించారు. దీంతో ఎక్సైజ్ అధికారులకు ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో మద్యం నాణ్యత లేకుండా పోతుందని కొందరు అంటున్నారు.