AP: కోనసీమ జిల్లాలోని మండపేట (M) రాయవరంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రాక్టర్‌ను తప్పించే క్రమంలో తండ్రీకూతురు బైకుపై వెళ్తుండగా ప్రమాదవశాత్తు కిందపడ్డాడు. బాలిక నాగవర్షిణి పడిపోవడంతో ఆమె ట్రాక్టర్ చక్రాలు కింద నలిగిపోయింది. బాలికను ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు వెల్లడించారు. దీంతో బాలిక కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.