బాలికపై అత్యాచారం.. గర్భం దాల్చడంతో ఫిర్యాదు

80చూసినవారు
బాలికపై అత్యాచారం.. గర్భం దాల్చడంతో ఫిర్యాదు
AP: తిరుపతి జిల్లా పిచ్చాటూరు మండలంలో 15 ఏళ్ల బాలికపై రెండు నెలల క్రితం అత్యాచారానికి పాల్పడ్డ ఓ వ్యక్తిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు నిండ్ర సీఐ రవీంద్ర తెలిపారు. శేఖర్ (55) అనే వ్యక్తి బాలికకు మాయమాటలు చెప్పి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపుతానని బెదిరించాడు. అయితే బాలిక గర్భం దాల్చడంతో జరిగిన విషయాన్ని తల్లికి చెప్పింది. దాంతో బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

సంబంధిత పోస్ట్