పంజాబ్‌లోని బటిండా జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ప్రియురాలి బ్లాక్ వేధింపులతో ఓ వ్యక్తి నాలుగు పేజీల సూసైడ్ నోట్ రాసి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల వివరాల ప్రకారం.. ఓ అమ్మాయి ప్రేమ పేరుతో మోసం చేసి మృతుడు రాహుల్ నుంచి భారీగా డబ్బులు వసూలు చేసిందని, ఆ వేధింపులు తాళలేక సూసైడ్ చేసుకున్నాడని వెల్లడించారు. కానీ సూసైడ్ నోట్ మాత్రం బయటపెట్టలేదు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.