ఈ నెల 23న పార్లమెంట్‌లో ప్రవేశపెట్టే బడ్జెట్‌లో ఏపీకి ప్రత్యేక సాయం ప్రకటించాలని కేంద్రమంత్రి అమిత్ షాను సీఎం చంద్రబాబు కోరారు. నిన్న ఆయన ఢిల్లీలో అమిత్ షాతో భేటీ అయి.. అమరావతి, పోలవరం ప్రాజెక్టుల నిర్మాణానికి నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే కొత్త జాతీయ రహదారులు, రైలు మార్గాలు మంజూరు చేయాలని సీఎం చంద్రబాబు విన్నవించారు.