కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ తన తాజా ట్వీట్‌లో భారత ప్రభుత్వంపై విమర్శలు చేశారు. పాకిస్థాన్‌లోని ఉగ్రస్థావరాలపై దాడులకు ముందు సమాచారం ఇవ్వడం నేరమని వ్యాఖ్యానించారు. ఈ విషయాన్ని విదేశాంగ మంత్రి జైశంకర్ బహిరంగంగా అంగీకరించారని పేర్కొన్నారు. దీనికి సంబంధించి ఓ వీడియోను కూడా ట్విట్టర్‌లో షేర్ చేశారు. ఈ ప్రకటనపై భారత ప్రభుత్వం ఎలా అనుమతిచ్చిందని ప్రశ్నించారు.